: కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
కృష్ణా జిల్లా మానికొండ మండలం నందమూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఉదయం బైక్ ను లారీ ఢీకొనడంతో భార్యాభర్తలు సహా వారి కుమార్తె దుర్మరణం పాలైంది. దీంతో, అక్కడ విషాద ఛాయలు నెలకొన్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.