: అక్కినేని నాగార్జున అవయవదానం


ఇటీవల కాలంలో రక్తదానంతో పాటు, అవయవదానంపైనా ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ఈ క్రమంలో నటుడు అక్కినేని నాగార్జున అవయవదానానికి సంతకం చేశారు. యశోదా హాస్పిటల్ హైదరాబాదులోని శిల్పకళావేదికలో నిర్వహించిన 'ఆర్గాన్ డొనేషన్ డ్రైవ్'లో పాల్గొన్న నాగ్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 4300 మంది అవయవదానానికి సమ్మతి తెలపడం విశేషం. కాగా, డ్రైవ్ కు హాజరైన వారితో నాగార్జున ప్రతిజ్ఞ చేయించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ, యశోదా ఆసుపత్రి యాజమాన్యం ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమన్నారు. అప్పట్లో తన తండ్రి నాగేశ్వరరావు కూడా అవయవదానానికి ముందుకొచ్చినా, డాక్టర్లు సాధ్యంకాదని చెప్పారని తెలిపారు. ఆయనకు సోకిన వ్యాధి కారణంగా అవయవదానం వీలుకాదన్నారని నాగ్ వివరించారు. కాగా, ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు శేఖర్ కమ్ముల, నటి సోనియా, షట్లర్ పీవీ సింధు కూడా అవయవదానానికి సంతకాలు చేశారు.

  • Loading...

More Telugu News