: అధికారులు, హమాలీల మధ్య వివాదం... కర్నూలు మార్కెట్ యార్డు మూసివేత


అధికారులు, హమాలీల మధ్య ఏర్పడిన వివాదం కర్నూలు మార్కెట్ యార్డు మూసివేతకు కారణమైంది. దీంతో, ఉల్లి సరుకుతో వచ్చిన రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అక్కడ భారీవర్షం కురుస్తుండడంతో తమ సరుకు దెబ్బతింటుందేమోనని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్ బయట దాదాపు 50 లారీల ఉల్లి సరుకు నిలిచిపోయింది. అధికారులు సత్వరమే చర్యలు తీసుకుని మార్కెట్ యార్డును తెరవాలని రైతులు కోరుతున్నారు.

  • Loading...

More Telugu News