: 'మార్స్ మిషన్' సంతృప్తికరం: ఇస్రో
భారత్ ప్రతిష్ఠాత్మక రీతిలో ప్రయోగించిన 'మార్స్ ఆర్బిటర్ మిషన్' సంతృప్తికరంగానే ప్రయాణం సాగిస్తోందని ఇస్రో పేర్కొంది. ఈ మేరకు ఆర్బిటర్ కీలక సమాచారాన్ని పంపించిందని తెలిపింది. ఆర్బిటర్ లోని కీలక మాడ్యూళ్ళు మెరుగ్గానే పనిచేస్తున్నాయన్న సమాచారం భూమికి చేరిందని ఇస్రో ట్విట్టర్లో తెలిపింది. కాగా, ప్రస్తుతానికి మార్స్ మిషన్ 211 మిలియన్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. అంటే, మొత్తం ప్రస్థానంలో ఇప్పటివరకు 95 శాతం ప్రయాణం పూర్తైంది. ఈ నెలాఖరుకు నిర్దేశిత అంగారక కక్ష్యలోకి ఈ ఆర్బిటర్ ప్రవేశిస్తుంది. మంగళ్యాన్ పేరిట రూపొందిన ఈ ప్రాజెక్టుకు రూ.450 కోట్లు ఖర్చయింది.