: సినీ ఫక్కీలో సాక్షి దినపత్రిక సిబ్బంది నుంచి రూ.32 లక్షల దోపిడీ


చిత్తూరు జిల్లా రేణిగుంటలో జరిగిన ఈ చోరీ సినిమా క్రైమ్ సీన్ ను తలపించింది. రేణిగుంటలో ఉన్న సాక్షి దినపత్రిక యూనిట్ కు చెందిన 32 లక్షల రూపాయలను బ్యాంకులో జమ చేయడానికి అకౌంటెంట్లు చంద్రశేఖర్, విజయ్ కుమార్ రెడ్డి బైక్ పై బయల్దేరారు. తమ బైక్ ను ఓ స్కార్పియో ఫాలో అవడాన్ని వీరు గమనించలేదు. సడెన్ గా ఆ స్కార్పియో సాక్షి సిబ్బంది ప్రయాణిస్తున్న బైక్ ను ఢీకొట్టగా... చంద్రశేఖర్, విజయ్ కుమార్ రెడ్డి రోడ్డుపై పడిపోయారు. ఇంతలో ఓ బైక్ పై ఇద్దరు దుండగులు వచ్చి, సాక్షి సిబ్బంది వద్ద ఉన్న నగదు బ్యాగును ఎత్తుకెళ్ళారు. దీనిపై సాక్షి అకౌంటెంట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనలో వారిద్దరికీ గాయాలయ్యాయి.

  • Loading...

More Telugu News