: ఏపీకి శాఖాధిపతుల కార్యాలయాల తరలింపుపై కమిటీ
ఉమ్మడి రాజధాని హైదరాబాదు నుంచి ఆంధ్రప్రదేశ్ కు వివిధ శాఖాధిపతుల కార్యాలయాల తరలింపుపై ఏపీ ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ముగ్గురు ఉన్నతాధికారులతో కూడిన ఈ కమిటీలో ఆర్థిక, రవాణా, మున్సిపల్ శాఖల ముఖ్య కార్యదర్శులు ఉన్నారు. ఏ విభాగాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపైనా... భవనాల లభ్యత, అద్దెలు, కార్యాలయాల తరలింపుకు పట్టే సమయానికి సంబంధించిన వాటిపైనా కమిటీ అధ్యయనం చేస్తుంది. పదిహేను రోజుల్లో వాటిపై నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తుంది.