: కాంగ్రెస్ పార్టీ ఓ డ్రామా కంపెనీ, పొన్నాల దానికి మేనేజర్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్
కాంగ్రెస్ పార్టీ నేతలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహబూబ్ నగర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, అధికారం లేక కాంగ్రెస్ నేతలు సైకోల్లా మారారని వ్యాఖ్యానించారు. అభివృద్ధి నిరోధకుల్లా తయారయ్యారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఓ డ్రామా కంపెనీ అని, పొన్నాల దానికి మేనేజర్ అని గౌడ్ ఎద్దేవా చేశారు.