: మోడీ జపం చేస్తోన్న అమెరికన్ మీడియా... భారత ప్రధానిపై న్యూయార్క్ టైమ్స్ సర్వే


సార్వత్రిక ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ సాధించడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇమేజ్ అంతర్జాతీయంగా బాగా పెరిగింది. గత ప్రధానమంత్రుల్లో ఒక్క ఇందిరాగాంధీకే అంతర్జాతీయంగా ఇంతటి ఇమేజ్ వచ్చింది. మోడీ సింగిల్ హ్యాండ్ తో బీజేపీని అధికారంలోకి తీసుకురావడం... బలమైన నేతగా ముద్రపడటం... టెక్నాలజీ ఫ్రెండ్లీ వ్యక్తి కావడం... గుజరాత్ ను కార్పొరేట్ తరహాలో బాగా అభివృద్ధి చేయడం తదితర కారణాల వల్ల మోడీకి అతి తక్కవకాలంలోనే ఇంటర్నేషనల్ ఇమేజ్ వచ్చింది. ఈ క్రమంలోనే, చాలా దేశాలు మోడీని తమ దేశంలో పర్యటించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాయని విదేశాంగ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే భూటాన్, జపాన్ పర్యటనలు పూర్తిచేసుకున్న మోడీ ఈ నెలాఖరులో అమెరికా పర్యటనకు వెళుతున్నారు. నరేంద్ర మోడీని సెప్టెంబర్ 28న న్యూయార్క్ లోని సుప్రసిద్ధ మాడిసన్ స్క్వేర్ గార్డెన్ లో ఘనంగా సన్మానించనున్నారు. దీని కోసం ఇండో అమెరికన్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఒబామా సర్కారు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు చాలామంది ఆసక్తి చూపించడంతో ఎవరిని ఆహ్వానించాలన్న విషయం అమెరికన్ ప్రభుత్వ వర్గాలకు తలనొప్పిగా మారింది. మాడిసన్ స్క్వేర్ గార్డెన్ సీటింగ్ కెపాసిటీ 20వేలు మాత్రమే. దీంతో, ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచినవారి నుంచి అప్లికేషన్లను ప్రభుత్వం ఆహ్వానించింది. ఇప్పటికే సుమారు లక్ష అప్లికేషన్లు ప్రభుత్వానికి అందాయి. వీరి నుంచి 20 వేలమందిని మాత్రమే లాటరీ ద్వారా ఎంపికచేస్తారు. సాధారణంగా వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు జరిపే అమెరికా పర్యటనలు కేవలం అఫిషియల్ కార్యక్రమాలుగా ఉంటాయి. కానీ మోడీ టూర్ అఫిషియల్ గా సాగడంతో పాటు ఎమోషనల్ గా సాగనుంది. అమెరికన్ మీడియా అయితే 'మోడీ ముందు భారత్'... 'మోడీ తర్వాత భారత్' అంటూ విశ్లేషణలు చేస్తోంది. న్యూయార్క్ టైమ్స్ పత్రిక మరింత ముందుకు వెళ్లి మోడీ-ఎన్నారైలు అన్న కాన్సెప్టుపై అభిప్రాయ సేకరణ జరుపుతోంది. మాడిసన్ స్వ్కేర్ గార్డెన్ లో జరగబోయే ర్యాలీలో మీరు పాల్గొంటున్నారా? మోడీ టూరును మీరు ఎలా చూస్తున్నారు? ఇండో అమెరికన్ సంబంధాలపై మోడీ పర్యటన ప్రభావం ఎలా ఉండబోతోంది. గత ఎన్నికల్లో మోడీకి మీరు మద్దతు పలికారా? మీ మూలాలను మోడీ ప్రభావితం చేశారా? వంటి ప్రశ్నలు అడుగుతోంది. దీంతో పాటు మోడీ పర్యటన నేపథ్యంలో ఈ సర్వేలో పాల్గొనే కొంతమంది ఎన్నారైల ఇంటర్వ్యూలు కూడా ప్రచురించాలని న్యూయార్క్ టైమ్స్ డిసైడ్ అయ్యింది. మీరు అమెరికన్ ఎన్నారైలయితే... దీనిలో పాల్గొనాలన్న ఆసక్తి మీకు ఉంటే ఈ లింకు ద్వారా ఆ సర్వేలో పాల్గొనండి. http://www.nytimes.com/interactive/2014/09/10/world/asia/narendra-modi-new-york.html?ref=asia&_r=1

  • Loading...

More Telugu News