: కేసీఆర్ పాలన బ్రహ్మాండంగా ఉంది: నిజాం ముఖరంజా సతీమణి ఇస్రా
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన బ్రహ్మాండంగా ఉందని 8వ నిజాం ముఖరంజా సతీమణి ఇస్రా వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చక్కగా అమలవుతున్నాయని ఆమె కితాబిచ్చారు. ప్రజలు కోరుకున్నట్లే కేసీఆర్ పాలన ఉందని ఆమె పేర్కొన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచడంతో పాటు... చారిత్రక, వారసత్వ వైభవాలను పునరుద్ధరించడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ప్రశంసించారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆమె మర్యాద పూర్వకంగా కలిశారు. కేసీఆర్ తో పాటు నిజామాబాద్ ఎంపీ కవిత, సీఎంవో అధికారులు ఆమెను సాదరంగా ఆహ్వానించారు.