: మావోల చేతిలో హోంగార్డు దారుణ హత్య
విశాఖ జిల్లాలో హోంగార్డును మావోయిస్టులు పొట్టనబెట్టుకున్నారు. విశాఖ జిల్లా ఉయ్యూరు మండల కలజీడు వద్ద హోంగార్డు మువ్వ రమేశ్ ను మావోయిస్టులు హత్య చేశారు. అతని మృతదేహాన్ని మావోయిస్టులు తూర్పు గోదావరి జిల్లా వై. రామవరం మండలం జంగాలతోటలో పడేశారు. పోలీసులకు ఇన్ ఫార్మర్ గా వ్యవహరిస్తున్నాడన్న అనుమానంతో రమేశ్ ను మావోలు హత్య చేసినట్లు తెలుస్తోంది. గతంలో మావోయిస్టు దళ కమాండర్ గా పనిచేసిన రమేశ్, పోలీసులకు లొంగిపోయాడు. ఈ క్రమంలో మావోలకు ఉపాధి కల్పనలో భాగంగా అతనిని పోలీసు శాఖ హోంగార్డుగా నియమించింది.