: కాశ్మీర్ లో ఊరిని మింగేసిన కొండచరియలు


జమ్మూ కాశ్మీర్ లో కురుస్తున్న భారీ వర్షాలు భారీ నష్టానికి కారణమవుతున్నాయి. ఇప్పటికే 200 మంది దాకా కాశ్మీరీలు మరణించగా, తాజాగా ఓ గ్రామమే తుడిచిపెట్టుకుపోయిన ఘటన ఉధంపూర్ జిల్లాలో వెలుగు చూసింది. జిల్లాలోని పుంజార్ సద్దాల్ గ్రామం కొండచరియల కింద సజీవ సమాధి అయ్యింది. గ్రామంలోని 41 మంది కొండచరియల కింద మృత్యువాత పడ్డారు. ఈ నెల 7నే గ్రామం తుడిచిపెట్టుకుపోగా, ఇప్పటిదాకా కేవలం పది మంది మృతదేహాలను మాత్రమే సహాయక సిబ్బంది వెలికి తీశారు. ఇంకా 31 మంది మృతదేహాలు కొండచరియల కిందే ఉండిపోయాయి. కేవలం నిమిషం వ్యవధిలోనే తమ గ్రామాన్ని కొండచరియలు కప్పివేశాయని ప్రమాదంలో బయటపడ్డ ఓ వ్యక్తి చెప్పాడు.

  • Loading...

More Telugu News