: మెదక్ లోక్ సభ స్థానం అన్ని పార్టీలకు 'ఇజ్జత్ కా సవాలే'!


మెదక్ లోక్ సభ స్థానాన్ని అన్ని ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీకి ఈ ఉపఎన్నిక అగ్నిపరీక్షగా మారింది. కేసీఆర్ రాజీనామా చేయడంతో మెదక్ లోక్ సభకు ఉపఎన్నిక అనివార్యమయింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరుగుతున్న తొలి ఎన్నిక కావడంతో...అధికార పార్టీకి ఈ ఎన్నిక పెను సవాల్‌గా మారింది. సీఎం కేసీఆర్‌ సొంత ఇలాకా కావడంతో... మెజార్టీ ఏమాత్రం తగ్గినా ప్రతిపక్షాలకు విమర్శలు చేసే అవకాశం ఇచ్చినట్లు అవుతుందని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. మరోవైపు గత ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం ఇచ్చి కూడా చావుదెబ్బతిన్న కాంగ్రెస్‌...... .ఈసారి మెదక్ పార్లమెంట్ సీటునైనా గెలుచుకుని పరువు దక్కించుకోవాలని తహతహలాడుతోంది. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపి... మెదక్ ఉపఎన్నికలో గెలవడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో తన సత్తా చాటుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. టిడిపి-బీజేపి కూటమి అభ్యర్ధిగా జగ్గారెడ్డి పోటీ చేస్తుండడంతో... ఈ ఉపఎన్నిక రెండు పార్టీలకు అతిపెద్ద సవాల్‌గా నిలిచింది. ఇలా ప్రతీ పార్టీ 'ఇజ్జత్ కా సవాల్' గా తీసుకోవడంతో మెదక్ ఉపఎన్నిక రసవత్తరంగా మారింది. ఈ త్రిముఖ పోరులో ఎవరు గెలుస్తారో తెలుసుకోవాలంటే ఈ నెల 16వరకు ఆగాల్సిందే

  • Loading...

More Telugu News