: ఐఎస్ఐఎస్ మిలిటెంట్ల సంఖ్యపై ఓ అంచనాకొచ్చిన సీఐఏ


ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) మిలిటెంట్లపై దాడులకు అమెరికా రంగం సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో మిలిటెంట్ల బలాబలాలు ఏపాటివన్న విషయమై అమెరికా సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) ఓ నివేదిక రూపొందించింది. ఇరాక్, సిరియాల్లో 20,000 నుంచి 31,500 మంది వరకు మిలిటెంట్లు ఉండవచ్చని ఓ అంచనాకు వచ్చింది. సిరియాలో ఉన్న 15,000 మంది మిలిటెంట్లలో 2000 మంది విదేశీయులని సీఐఏ భావిస్తోంది. ఈ మేరకు సీఐఏ ప్రతినిధి ర్యాన్ ట్రపాని ఓ ప్రకటన విడుదల చేశారు. జూన్ నుంచి ఐఎస్ఐఎస్ గ్రూపులో నియామకాలు ఎక్కువయ్యాయని ర్యాన్ పేర్కొన్నారు. కొన్ని ఘటనల్లో ఐఎస్ఐఎస్ దే పైచేయి కావడంతో, ఎక్కువమంది ఈ గ్రూపు పట్ల ఆకర్షితులవుతున్నారని వివరించారు.

  • Loading...

More Telugu News