: హైదరాబాదులో రెండో భార్య ఇంటిపై నుంచి పడి ఆస్ట్రేలియన్ మృతి
ఆస్ట్రేలియా జాతీయుడు వాలంటైన్ రేమాండ్ స్టోన్ (77) ఇంజినీరుగా పదవీ విరమణ చేశాడు. 20 ఏళ్ళ క్రితం క్రిస్టియన్ మిషనరీలతో పాటు ప్రచారానికి భారత్ వచ్చి హైదరాబాదులో స్థిరపడ్డాడు. అప్పటి నుంచి సి.సత్యమ్మ అనే మహిళతో పాటే ఉంటున్నాడు. ఆమెను రెండో వివాహం చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ నెల 6న చిలుకూరులో సత్యమ్మ ఇంటి టెర్రస్ పై నుంచి పడి వాలంటైన్ మరణించాడు. దీనిపై పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ఆరంభించారు. వాలంటైన్ మరణం పట్ల ఆస్ట్రేలియాలో ఉన్న అతని కుమారుడు మైకేల్ కు సమాచారం అందించారు. మైకేల్ గురువారం నాడు హైదరాబాదుకు రాగా, పోస్టుమార్టం నిర్వహించి వాలంటైన్ మృతదేహాన్ని అతడికి అప్పగించారు. ఈ ఘటన వివరాలను మొయినాబాద్ ఇన్ స్పెక్టర్ ఎస్. రవిచంద్ర మీడియాకు తెలిపారు.