: త్వరలో ఆంధ్రప్రదేశ్ కు సౌర విద్యుదుత్పత్తి పార్క్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో 50 మెగావాట్ల 'సోలార్ పవర్ జనరేషన్ పార్కు'ను ఏర్పాటు చేయబోతున్నట్లు సోలార్ పవర్ డెవలపర్ రేస్ పవర్ సంస్థ నిపుణులు న్యూఢిల్లీలో ప్రకటించారు. ఆరు నెలల్లో ఇది ఏర్పాటవుతుందని తెలిపారు. ఈ మేరకు 'రేస్ పవర్' ఓ ప్రకటన విడుదల చేసింది. "ఈ ప్రాజెక్టు సాంకేతికంగానూ, ఇంజినీరింగ్ గ్రౌండ్ వర్క్ పరంగానూ, ఆరంభించినప్పటి నుంచీ పూర్తి మౌలిక రూపకల్పన కలిగి ఉంటుంది. ప్రాజెక్టు మొత్తానికి కేటాయించిన రూ.300 కోట్లలో ఇప్పటికే కంపెనీ రూ.20 కోట్లు ఖర్చు చేసింది" అని కంపెనీ ఓ ప్రకటనలో వివరించింది. రేస్ పవర్ డైరెక్టర్ రాహుల్ గుప్తా మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టును తాము 2015 జనవరి కల్లా పూర్తి చేస్తామని చెప్పారు. ఇటువంటి పార్కులనే దేశంలో పలుచోట్లు నెలకొల్పాలనుకుంటున్నట్లు చెప్పారు.