: గోల్కొండ కోటపై జెండా ఎగురవేసిన తర్వాత కేసీఆర్ కు నిరంకుశ బుద్ధులొచ్చాయి: ఎర్రబెల్లి


తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిపై ప్రతిపక్షాల విమర్శలు, ఆరోపణలు కొనసాగుతున్నాయి. తాజాగా తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, గోల్కొండ కోటపై జెండా ఎగురవేసిన తర్వాత కేసీఆర్ కు నిరంకుశ బుద్ధులొచ్చాయన్నారు. అందుకే ఆయన ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఒక్క ఆయన కుటుంబానికే 'బంగారు తెలంగాణ' కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కు దమ్ముంటే అసెంబ్లీని వెంటనే సమావేశపర్చాలని డిమాండ్ చేశారు. వంద రోజుల పాలన ముగిసినా గ్రామాల్లో ఇంతవరకు ఏ పనీ పూర్తికాలేదన్న ఎర్రబెల్లి సర్పంచ్ లకు వర్తించే నిబంధనలు కేసీఆర్ కు వర్తించవా? అని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News