: చంద్రబాబుకు 'మెంటల్' చెకప్ చేయించండి: తమ్మినేని సీతారాం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి 'మెంటల్' చెకప్ చేయించాలని అంటున్నారు వైఎస్సార్సీపీ నేత తమ్మినేని సీతారాం. ఎక్కడికి వెళ్ళినా బాబుకు జగన్ నామస్మరణతోనే సరిపోతోందని, బహుశా, ఆయనకు మతిస్థిమితం తప్పినట్టుందని వ్యాఖ్యానించారు. బాబును కుటుంబ సభ్యులు ఏదైనా మంచి ఆసుపత్రిలో చేర్పించి పరీక్షలు చేయించాలని సూచించారు. తాను ఇంతకుముందు టీడీపీలో పని చేశానని, అందుకే, బాబు శ్రేయస్సు కోరి ఈ మాట చెబుతున్నానని అన్నారు. ఏపీని కాసేపు సింగపూర్ చేస్తానంటారని, కొద్దిసేపటికే మాటమార్చి, మరో ముంబయి చేస్తానంటారని తమ్మినేని ఎద్దేవా చేశారు. ఇప్పటికే సింగపూర్, ముంబయి ఉన్నాయని, ఇప్పుడు బాబు కొత్తగా చేసేది ఏమిటని అన్నారు.