: టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అరెస్ట్
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో కేసీఆర్ సర్కార్ విఫలమైందని ఆరోపిస్తూ... అన్ని జిల్లా కలెక్టరేట్లను ముట్టడించే కార్యక్రమాన్ని టీకాంగ్రెస్ పార్టీ చేపట్టింది. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ను పార్టీ నేతలు, కార్యకర్తలతో కలసి పొన్నాల ముట్టడించారు. కలెక్టరేట్ లోకి చొచ్చుకు వెళ్లేందుకు యత్నించారు. ఈ నేపథ్యంలో, పోలీసులకు, కాంగ్రెస్ శ్రేణులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. దీంతో, పొన్నాలతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.