: 'నా పేరు ఖాన్... నేను హిందువుని'... ఇదో విచిత్రగాథ!


ఆగ్రా సమీపంలో ఖేరా సదన్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామస్తులు, వారి పేర్లు హిందూముస్లిం మతాల మిశ్రమం అనుకోవచ్చు. మున్నాలాల్ ఖాన్, కరీం సింగ్, సలీం ఠాకూర్... ఇలాగన్నమాట. దీనివెనుక పెద్ద చరిత్రే ఉంది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాలన సమయంలో అక్కడి హిందువులను మతం మారాలని ఆజ్ఞాపించారు. లేకుంటే ఇళ్ళు వదిలి వెళ్ళిపోవాలని హుకుం జారీచేశారు. దీంతో, తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడి హిందువులు మతం మారారు. ఇక, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కొందరు స్థానిక నేతలు తిరిగి హిందూమతంలోకి వచ్చేయాలని సూచించగా, కొందరు మారారు, కొందరు మారలేదు. ఈ గ్రామానికి చెందిన విక్రమ్ సింగ్ అనే వ్యక్తి మాట్లాడుతూ, తన తల్లి ఖుష్నూమా ముస్లిం అని, తండ్రి కమలేశ్ సింగ్ హిందువని వివరించారు. ఆయన తాజాగా మీడియాలో వస్తున్న 'లవ్ జిహాద్' ను నాన్సెన్స్ అంటూ కొట్టిపారేశారు. తన సోదరి సీత... ఇంజమామ్ అనే వ్యక్తిని పెళ్ళి చేసుకుందని తెలిపారాయన. ఇక, ఖేరా సదన్ గ్రామంలోని ప్రార్థనా మందిరాలు, ఆలయాల్లో ఇరుమతాలకు చెందిన వారు పూజలు, ప్రార్థనలు, నమాజులు ఆచరిస్తుండడం విశేషం. ఆలయాల్లో ముస్లింల పూజలు, మసీదుల్లో హిందువుల నమాజులు ఇక్కడ చూడొచ్చు.

  • Loading...

More Telugu News