: ఆంధ్రా వాళ్లను తిడితే... తెలంగాణ వాళ్ల కడుపు నిండుతుందా?: ఇంద్రసేనారెడ్డి
తెలంగాణలో అనేక సమస్యలు ఉన్నాయని... వాటన్నింటినీ పరిష్కరించకుండా గాలికొదిలేశారని టీఎస్ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంద్రసేనారెడ్డి అన్నారు. ప్రజలకు అత్యంత ముఖ్యమైన అంశాలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ చేయడానికి కూడా అధికారులు దొరకడం లేదా? అని ప్రశ్నించారు. ఎంతసేపూ ఆంధ్రా వారిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని... వారిని తిడితే తెలంగాణ వాళ్లకు కడుపు నిండుతుందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాదులోని బీజేపీ ఆఫీసులో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.