: ఇకపై తెలంగాణ పాఠ్యపుస్తకాల్లో ఏపీకి చెందిన ఏ అంశం ఉండదు!


ఇకమీదట తెలంగాణ రాష్ట్ర పాఠ్యపుస్తకాల్లో ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సంస్కృతి కనపించకపోవచ్చు. పాఠశాల టెక్ట్స్ పుస్తకాల్లో ఆంధ్రప్రదేశ్ వివరాలతో ఉన్న అధ్యాయాలను తొలగించాలని తెలంగాణ సర్కారు భావిస్తుండడమే అందుకు కారణం. ఇకపై కొత్త సిలబస్ తో పుస్తకాలు అచ్చు వేయించాలని నిర్ణయించిన ప్రభుత్వం అందుకోసం రెండు కమిటీలను ఏర్పాటు చేసింది. తెలుగు, సాంఘికశాస్త్రం సిలబస్ రూపకల్పనపై ఈ రెండు కమిటీలు సమీక్ష చేపట్టనున్నాయి. ఈ విషయమై తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి అధికారులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది. ఆంధ్ర సాహిత్యం, ఆంధ్ర చరిత్రకు చెందిన ఏ అంశమూ పాఠ్యపుస్తకాల్లో ఉండడానికి వీల్లేదని మంత్రి అధికారులకు సూచించినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News