: జమ్మూకాశ్మీర్ కు రూ. 1000 కోట్ల సాయం: రాజ్ నాథ్


జమ్మూకాశ్మీర్ లో ఇప్పటి వరకు 1.30 లక్షల మందిని సైన్యం రక్షించిందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. రక్షణ చర్యల్లో సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రధాన ప్రాత పోషించాయని అన్నారు. తమ ప్రభుత్వం మాటలు మాత్రమే చెప్పదని... చేతల్లో కూడా చూపిస్తుందని తెలిపారు. జమ్మూకాశ్మీర్ ను అన్ని విధాలా ఆదుకుంటామని రాజ్ నాథ్ చెప్పారు. రాష్ట్రంలోని వరద పరిస్థితిని కేంద్ర హోంశాఖ కార్యదర్శి స్వయంగా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. వరదబాధితుల పునరావాసానికి రూ. 1000 కోట్ల సాయం అందిస్తామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News