: 2029 నాటికి అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్: చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర దిశగా తీసుకెళ్లేందుకు పలు చర్యలను చేపడుతున్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందేందుకు అనేక అనుకూలతలు ఉన్నాయని చెప్పారు. 2029 నాటికల్లా దేశంలోనే ఏపీని అగ్రస్థానంలో నిలబెడతామని అన్నారు. తిరుపతిలో జరుగుతున్న 14వ ఆర్థిక సంఘం సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ఈ వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు అనేక అవకాశాలు ఉన్నాయని బాబు తెలిపారు. రానున్న ఐదేళ్లలో 100 శాతం అక్షరాస్యతను సాధిస్తామని చెప్పారు. ఓడ రేవులను అభివృద్ధి పరుస్తామని... కోస్తా తీరాన్ని గేట్ వే ఆఫ్ ఇండియాగా తయారు చేస్తామని తెలిపారు. ఇండస్ట్రియల్ కారిడార్, స్మార్ట్ సిటీల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుతానికి ఏపీ రాష్ట్రానికి ఎన్నో సమస్యలు ఉన్నాయని... అయితే, వాటన్నింటినీ అధిగమిస్తామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News