: వస్త్రధారణలో పొదుపు పాటిస్తున్న హాలీవుడ్ తార
సినిమా నటులు చెప్పే సంగతులు తమాషాగా ఉంటాయి. తాజాగా హాలీవుడ్ నటి, గాయని ఆరియానా గ్రాండి (21) అలాంటి సంగతే బయటపెట్టింది. పెద్దల మాట చద్ది మూట అన్నట్టు... తన అమ్మమ్మ మాటను అక్షరాలా పాటిస్తున్నానని తెలిపింది. ఇంతకీ వాళ్లమ్మమ్మ ఏం చెప్పిందనేగా మీ సందేహం... నిద్రించేటప్పుడు ఒంటిపై నూలుపోగు లేకుండా నిద్రపోవాలని చెప్పిందట, దానిని ఈ ముద్దుగుమ్మ తూచ తప్పకుండా పాటిస్తుందట. వీలైనంత తక్కువ బట్టలతో నిద్రపోతానని చెప్పింది. తనకు మనుషులకంటే కుక్కలంటేనే ఇష్టమని, తన దగ్గర నాలుగు కుక్కలు ఉన్నాయని ఆరియానా గాండ్రి వివరించింది. కొన్ని సార్లు కుక్కలతోనే కలసి నిద్రిస్తానని వెల్లడించింది. అంతే కాదండోయ్, ఆరియానా పూర్తిగా శాకాహారి. ఆ విషయం కూడా ఆమె చెప్పింది.