: 'జంపింగ్ లవర్' కేంద్ర మంత్రి సదానంద గౌడ కుమారుడు అరెస్ట్
కన్నడ నటి మైత్రేయిని ప్రేమ పేరిట మోసం చేసి, రహస్యంగా పెళ్లి చేసుకుని ముఖం చాటేసిన కేసులో కేంద్ర మంత్రి సదానంద గౌడ కుమారుడు కార్తీక్ గౌడ బెంగళూరు పోలీసులకు లొంగిపోయారు. ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు, కార్తీక్ గౌడ వాంగ్మూలాన్ని రికార్డు చేయనున్నారు. అనంతరం అతనిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించనున్నారు. అక్కడి నుంచి న్యాయస్థానంలో అతనిని హాజరుపరుస్తారు. మైత్రేయి పోలీసులను ఆశ్రయించడంతో కార్తీక్ గౌడ అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు. న్యాయస్థానం కేంద్ర మంత్రికి నోటీసులు పంపడంతో ఆయన పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షమయ్యారు.