: హైదరాబాదులో బరితెగించిన ముగ్గురు యువకులు


హైదరాబాదులో ముగ్గురు యువకులు బరి తెగించారు. ఆటోల్లో వెళ్లేవారినే కాదు, కార్లలో తిరిగే వారిని కూడా దుండగులు వదలడం లేదు. పోలీసుల పర్యవేక్షణ లోపం కారణంగా ఎక్కడ పడితే అక్కడ అల్లరి మూకలు స్వైరవిహారం చేస్తున్నాయి. తాజాగా, రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై గత అర్ధరాత్రి కారులో ఓ జంట వెళ్తున్న విషయాన్ని గమనించిన ముగ్గురు యువకులు బైకులపై కారును వెంబడించారు. కారును ఛేజ్ చేశారు. రోడ్డుకు అడ్డంగా బైకులు ఉంచి కారును ఆపేశారు. కారులోని యువతితో అసభ్యంగా ప్రవర్తించారు. దాంతో కారులోని జంట 100 నెంబర్ డయల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రహదారి కావడంతో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఆ ముగ్గురూ ఔటర్ రింగ్ రోడ్డు స్టాఫ్ అనీ, వారి పేర్లు ముఖేష్, ప్రవీణ్, నవదీప్ అని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News