: షీలా దీక్షిత్ వ్యాఖ్యలతో ఇరుకున పడ్డ కాంగ్రెస్


షీలా దీక్షిత్... కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరు. సోనియాగాంధీకి నమ్మిన బంటు. వరుసగా మూడు సార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా వ్యవహరించి... కాంగ్రెస్ పార్టీలో తానెంత ప్రధానమైన వ్యక్తో నిరూపించుకున్న నేత. అలాంటి షీలా దీక్షిత్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకే పెద్ద తలనొప్పిలా మారారు. ఢిల్లీ ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ప్రజలంతా బీజేపీకి మద్దతిస్తేనే బాగుంటుందన్న షీలా వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. బద్ధ విరోధి బీజేపీకి అనుకూలంగా షీలా మాట్లాడటంపై కాంగ్రెస్ పెద్దలు కారాలు, మిరియాలు నూరుతున్నారు. ఆమె వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి మరింత చేటును తెస్తాయని భావిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ఇన్ ఛార్జ్ షకీల్ అహ్మద్ మాట్లాడుతూ, ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి షీలా చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం మాత్రమే అని తెలిపారు. ఏఐసీసీ కార్యవర్గం, ఎమ్మెల్యేలంతా బీజేపీకి సపోర్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తారని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News