: నేడు సుప్రీంలో నిఠారి హంతకుడు కోలి పిటిషన్ విచారణ


నిఠారి వరుస హత్యల కేసు ముద్దాయి కోలి దాఖలు చేసుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారించనుంది. ఉరికంబం ఎక్కనున్న చివరి క్షణంలో కోలి, సుప్రీంకోర్టును ఆశ్రయించగా... ఉరిశిక్షను వారం పాటు వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్. దత్తు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. గురువారం కోలిని అతడి తల్లి కుంతీదేవి జైలులో కలిశారు. శుక్రవారం సుప్రీంకోర్టులో జరగనున్న విచారణ కోలి భవితవ్యాన్ని తేల్చనుంది. ఈసారి కోలికి ఉపశమనం లభించకపోతే, వెనువెంటనే అతడు ఉరికంబమెక్కాల్సిందే.

  • Loading...

More Telugu News