: జేమ్స్ బాండ్ విలన్ 'జాన్' ఇకలేరు!
జేమ్స్ బాండ్ తొలి సిరీస్ చూసిన ప్రతి ఒక్కరికీ అతను సుపరిచితుడు. ఏడడుగుల రెండంగుళాల పొడవుతో, స్టీల్ పళ్లతో జేమ్స్ బాండ్ ను అమాంతం గాల్లోకి ఎత్తి కొట్టిన విలన్ ఇక లేరు. జేమ్స్ బాండ్ విలన్ గా వినుతికెక్కిన రిచర్డ్ కైల్ (74) కాలు విరిగి ఆసుపత్రిలో చేరి కన్నుమూశారు. 'స్పై హూ లవ్డ్ మీ' (1977), 'మూన్ రేకర్' (1979) తదితర బాండ్ చిత్రాల్లో రిచర్డ్ పోషించిన జాన్ పాత్రలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బాండ్ అభిమానులను అలరించాయి. 1939లో సెప్టెంబర్ 13న మిచిగాన్ లో పుట్టిన రిచర్డ్ 1960లో 'లారెమై' టీవీ కార్యక్రమం ద్వారా బుల్లితెరకు పరిచయమయ్యారు. 1961లో 'ది ఫాంథమ్ ప్లానెట్' సినిమా ద్వారా వెండితెర అరంగేట్రం చేశారు.