: ఇస్లామిక్ తీవ్రవాదుల సంఖ్య 30 వేలు దాటేసింది: సీఐఏ


సిరియా, ఇరాక్ లను రావణకాష్టంలా మార్చేసిన ఇస్లామిక్ తీవ్రవాదుల సంఖ్య శరవేగంగా పెరిగిందని అమెరికా గూఢచార సంస్థ సీఐఏ అంచనా వేస్తోంది. గతంలో 10 వేల లోపే ఉన్న తీవ్ర వాదుల సంఖ్య తాజాగా 20 వేల నుంచి 31,500 దాకా ఉంటుందని సీఐఏ అధికార ప్రతినిధి ర్యాన్ ట్రపాని చెప్పారు. జూన్ నుంచి ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ సిరియాతో పాటు ఇరాక్ లోనూ ప్రత్యక్ష యుద్ధ రంగంలోకి దిగిన నేపథ్యంలో, పెద్ద సంఖ్యలో కొత్త నియామకాలను చేపట్టడంలో సఫలమైందని ఆయన తెలిపారు. బలగాన్ని పెంచుకున్న క్రమంలోనే తీవ్రవాద సంస్థ కొంత మేర విజయాలను నమోదు చేసిందని కూడా ర్యాన్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News