: శంషాబాద్ ఎయిర్ పోర్టులో బ్యాగ్ కలకలం
శంషాబాద్ ఎయిర్ పోర్టు అధికారులను ఓ బ్యాగ్ పరుగులు పెట్టించింది. హైదరాబాదులోని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఓ బ్యాగ్ చాలా సేపటినుంచి పడి ఉండడం గమనించిన ప్రయాణికులు విమానాశ్రయం అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అప్రమత్తమైన అధికారులు బాంబ్ స్క్వాడ్, స్నిఫర్ డాగ్ ను రంగంలోకి దించారు. ప్రయాణికులను అప్రమత్తం చేసిన అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.