: తుది దశలో తెలంగాణకు ప్రత్యేక ఎన్నికల సంఘం ఏర్పాట్లు


రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానంలో తెలంగాణకు ప్రత్యేక ఎన్నికల సంఘం ఏర్పాటు చేయాల్సి ఉంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం పదో షెడ్యూల్ లో ఈ అంశాన్ని పేర్కొన్నారు. దీంతో, తెలంగాణకు ప్రత్యేక ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేసే పని వేగంగా సాగుతోంది. ప్రస్తుతం ఈ ఫైలు న్యాయశాఖ పరిశీలనలో ఉంది. అక్కడి నుంచి గవర్నర్ ఆమోదం కోసం వెళుతుంది. గవర్నర్ ఆమోదముద్ర వేయగానే... రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ప్రత్యేక తెలంగాణ ఎన్నికల సంఘం ఏర్పాటవుతుంది.

  • Loading...

More Telugu News