: సరిగా వినపడడం లేదని భావిస్తున్నారా... పరిష్కారం ఇదిగో!
మీకు సరిగ్గా వినిపించడం లేదా? చెవుడు బారిన పడకుండా ఉండాలనుకుంటున్నారా? అయితే పరిష్కారమిదిగో... వారానికి రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు చేపలు తింటే వినికిడి సమస్య మీ దరి చేరదని నిపుణులు సెలవిస్తున్నారు. వారంలో రెండుసార్లు చేపలు తినే మహిళల్లో వినికిడి లోపం 20 శాతం తక్కువగా ఉన్నట్టు పరిశోధనల్లో బయటపడిందని వారు వెల్లడించారు. నిజానికి వయసు పైబడే కొద్దీ వినికిడి సమస్య పెరుగుతుంది. మార్చుకోదగిన ముప్పు కారకాలను గుర్తించడం ద్వారా సమస్య దరిజేరకుండా, లేదా ముప్పు ఆలస్యమయ్యేలా చేసే అవకాశముందని బ్రైగమ్ అండ్ వుమెన్స్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. చేపల్లో ఏ రకం తిన్నా వినికిడి సమస్య తగ్గుతుందని వారు స్పష్టం చేశారు.