: ఆ తండ్రిని క్షమాపణలు కోరిన ఫేస్ బుక్
అనాలోచితంగా చేసిన తప్పుకు ఫేస్ బుక్ క్షమాపణలు చెప్పింది. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న తన నెలల బిడ్డ చికిత్స కోసం డబ్బు సేకరించేందుకు ఫొటోతో ప్రకటన ఇచ్చి సహకరించాలని బాలుడి తండ్రి ఫేస్ బుక్ ను కోరాడు. న్యూయార్క్ లో హడ్సన్ బాడ్ అనే రెండు నెలల చిన్నారి పుట్టుకతో కార్డియోమయోపతి అనే వ్యాధితో బాధపడుతున్నాడు. బాలుడి ఆపరేషన్ కు 75 వేల డాలర్లు కావాలి. దీంతో బాలుడితో తల్లీతండ్రి కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసి డొనేషన్లు కోరేందుకు అనుమతి కోరాడు. దీంతో రక్తసిక్తంగా, భయంకరంగా, ప్రతికూల స్పందనలు వచ్చే ఫొటోలను తమ సైట్ లో ప్రచురించమని ఫేస్ బుక్ అతని అభ్యర్థనను తిరస్కరించింది. తరువాత బాలుడి పరిస్థితిని తెలుసుకున్న ఫేస్ బుక్, హడ్సన్ బాడ్ తల్లిదండ్రులను క్షమాపణలు కోరింది. వెంటనే ఫేస్ బుక్ లో ప్రకటన ఇచ్చింది. ఫేస్ బుక్ ప్రకటన ద్వారా వారికి 30 వేల డాలర్ల సొమ్ము సమకూరింది.