: సెల్ఫీలతో బాలికా విద్యపై సందేశం


సెల్ఫీల ద్వారా బాలికా విద్య ఆవశ్యకతపై అవగాహన పెంచే కార్యక్రమాన్ని ఢిల్లీలోని 'ఎడ్యుకేట్ గర్ల్స్' అనే స్వచ్ఛంద సేవా సంస్థ ప్రారంభించింది. దీనికి మద్దతుగా ప్రతి ఒక్కరూ సెల్ఫీలు తీసుకుని, సెల్ఫీస్ 4 స్కూల్ అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేసి ఫేస్ బుక్, ట్విట్టర్లో పొందుపరచాలని వారు సూచించారు. ఈ కార్యక్రమానికి వొడాఫోన్ సహకరిస్తుందని వారు తెలిపారు. నేటి సెల్ఫీ యుగాన్ని బాలికా విద్యను పెంచేందుకు, బాల్య వివాహాలను అరికట్టేందుకు ఉపయోగించుకోవడం చాలా ఆనందరంగా ఉందని నిర్వాహకురాలు సఫీనా హుస్సేన్ అభిప్రాయపడ్డారు. దీని కారణంగా పట్టణాల్లో బాలిక విద్య, బాల్య వివాహాలపై అవగాహన పెరుగుతుంది ఆమె పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News