: ఇక 17 జిల్లాల తెలంగాణ?


10 జిల్లాల తెలంగాణ రాష్ట్రం 17 జిల్లాల రాష్ట్రంగా అవతరించనుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజనతో పది జిల్లాల నూతన రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో మరో ఏడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఏడు జిల్లాల ఏర్పాటుకు అవసరమైన సమాచారం సిద్ధం చేయాలంటూ సీసీఎల్ఏను తెలంగాణ ప్రభుత్వం కోరింది. తొలిదశలో 1) మంచిర్యాల 2) జగిత్యాల 3) సిద్ధిపేట 4) వికారాబాద్‌ 5) సూర్యాపేట 6) కొత్తగూడెం 7) నాగర్‌కర్నూలు జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్టు అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News