: వైఎస్ విజయమ్మకు భద్రత పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మకు ఇటీవల తొలగించిన 2+2 భద్రతను పునరుద్ధరించాలని ఉమ్మడి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆమెతో పాటు వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్ కు కూడా భద్రత కొనసాగించాలని ఆదేశించింది. మళ్లీ తాము ఉత్తర్వులు ఇచ్చేవరకు భద్రత కొనసాగించాలని కోర్టు తెలిపింది. ఆగస్టు 22న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయమ్మకు ఉన్న భద్రతను తొలగించింది. దాంతో ఆమె, షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్ లు హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్ లను విచారించిన న్యాయస్థానం తాజా ఉత్తర్వులు జారీ చేసింది.