: ధోనీపై రవిశాస్త్రి సానుభూతి


టీమిండియా సారథి మహేంద్ర సింగ్ ధోనీపై జట్టు కోచింగ్ డైరక్టర్ రవిశాస్త్రి సానుభూతి ప్రదర్శిస్తున్నారు. సామర్థ్యానికి తగిన పేరుప్రతిష్ఠలు ధోనీకి దక్కడంలేదని అభిప్రాయపడ్డారు. ఓ మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, "నాకిప్పుడు తెలిసింది, మరే ఇతర భారత కెప్టెన్ కు సాధ్యంకాని రీతిలో, ధోనీ ఖాతాలో ఇన్ని విజయాలు ఎలా సాధ్యమయ్యాయో! ధోనీ అద్భుమైన నాయకుడు" అని కితాబిచ్చారు.

  • Loading...

More Telugu News