: మా అబ్బాయి మంచోడు: నిఠారి కిల్లర్ తల్లి


నిఠారి హత్యల కేసులో మరణశిక్ష ఎదుర్కొంటున్న సురిందర్ కోలీ తల్లి కుంతీదేవి తన కుమారుడు అమాయకుడని అంటోంది. కోలీ యజమాని మొనిందర్ సింగ్ పంథేర్ ఆ హత్యలకు బాధ్యుడని ఆరోపించింది. మీరట్ జైల్లో ఉన్న కుమారుడిని చూసేందుకు వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడిని కుంతీ దేవి, తన కుమారుడి కంటే ముందు పంథేర్ ను ఉరితీయాలని సూచించింది. పంథేర్ పలుకుబడిని ఉపయోగించి ఈ కేసు నుంచి తప్పించుకున్నాడని ఆమె ఆరోపించింది. కాగా, నిఠారి హత్యల కేసులో కోలీ, పంథేర్ లకు తొలుత న్యాయస్థానం మరణశిక్ష విధించింది. అనంతరం, అలహాబాద్ హైకోర్టు పంథేర్ ను నిర్దోషిగా పేర్కొని, కోలీకి మరణశిక్షను ఖరారు చేసింది. సుప్రీం కోర్టు కూడా కింది కోర్టు తీర్పుతో ఏకీభవించింది.

  • Loading...

More Telugu News