: భారత్, పాక్ లు కొత్తగా చర్చలు జరిపేందుకు ఇదే సమయం: అబ్దుల్ బాసిత్
నెల రోజుల కిందట పాకిస్థాన్ తో చర్చలు జరిపేందుకు భారత్ తిరస్కరించిన సంగతి తెలిసిందే. తాజాగా భారత్ లో పాక్ రాయబారి అబ్దుల్ బాసిత్ మాట్లాడుతూ, ఇరు దేశాలు తప్పకుండా కొత్తగా చర్చలు ప్రారంభించాలన్నారు. ఈ మేరకు న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో ఏర్పాటు చేసిన అలీషాన్ పాకిస్థాన్ ఎక్స్ పోలో మాట్లాడుతూ, భారత్-పాక్ సంబంధాలు చాలా ప్రత్యేకమైనవని నొక్కి చెప్పారు. అంతేగాకుండా, ఇరుగుపొరుగు దేశాలు గతాన్ని మరచి నవశకానికి నాంది పలికేందుకు ఇదే సరయిన సమయమని పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాలు నెలకొనడం ఎంతో ముఖ్యమైన అంశమన్నారు.