: ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీకి ఛాన్స్ ఇవ్వాలి: షీలా దీక్షిత్
ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్ఠంభన కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ సీఎం షీలా దీక్షిత్ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీకి అవకాశం ఇవ్వాలన్నారు. ఈ మేరకు ఏఎన్ఐతో ఆమె మాట్లాడుతూ, ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వం ఏర్పాటైతే నేను సంతోషిస్తాను. తాము ప్రభుత్వం ఏర్పాటు చేయగలమని బీజేపీ ఇప్పటికే తెలిపింది. నా ఆలోచన ప్రకారం ఓసారి వారికి ఛాన్స్ ఇవ్వాల అని పేర్కొన్నారు. ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ ప్రభుత్వానికి నిజమైన పరీక్ష ఎదురవుతుందని చెప్పారు.