: ఎంసెట్ రెండో విడత కౌన్సిలింగ్ కు సుప్రీంకోర్టు నిరాకరణ


ఎంసెట్ రెండో విడత కౌన్సిలింగ్ కు సుప్రీంకోర్టు అనుమతి నిరాకరించింది. మొదటి విడత కౌన్సిలింగ్ తర్వాత 65 వేలకు పైగా ఇంజనీరింగ్ సీట్లు మిగిలిపోయాయని... అందువల్ల రెండో విడత కౌన్సిలింగ్ కు అనుమతించాలని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే, ఉన్నత విద్యామండలి అభ్యర్థనను సుప్రీంకోర్టు నిరాకరించింది. కౌన్సిలింగ్ గడువు పొడిగింపుపై తమకు ముందే ఎందుకు చెప్పలేదని ఉన్నత విద్యామండలిని సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించింది. మొదటి విడత కౌన్సిలింగ్ షెడ్యూల్ నే యథావిధిగా కొనసాగించాలని కోర్టు ఆదేశించింది.

  • Loading...

More Telugu News