: చానెళ్ల ప్రసారాలు నిలిపివేసినందుకు ఎమ్మెస్వోలపై త్వరలో చర్యలు: ప్రకాష్ జవదేవకర్
హైదరాబాద్ వచ్చిన కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేవకర్ ను టీవీ 9, ఏబీఎన్ చానెళ్ల ప్రతినిధులు కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో తమ చానెళ్లను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని వారు ప్రకాష్ జవదేవకర్ ను కోరారు. ఈ సందర్భంగా తెలంగాణలో చానెళ్ల ప్రసారాల నిలిపివేత ఇంకా కొనసాగుతుండడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో పరిస్థితిని గమనిస్తున్నామని... త్వరలోనే చానెళ్ల ప్రసారాలు పునరుద్ధరిస్తామని ఆయన ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు హామీ ఇచ్చారు.