: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంగరంగ వైభవంగా ముస్తాబవుతోన్న తిరుమల


ఈనెల 26 నుంచి ప్రారంభమయ్యే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమల అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. అప్పటికి వారం రోజుల ముందే ఏర్పాట్లు పూర్తి కావాలన్న లక్ష్యంతో టీటీడీ ఉద్యోగులు, సిబ్బంది శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రోడ్లకు మరమ్మతులు, ప్రధాన కూడళ్లలో ఆర్చీలు, స్వాగత తోరణాలు, వివిధ రకాల దేవతామూర్తుల కటౌట్లు, ఆలయానికి ఆకర్షణీయంగా విద్యుద్దీపాలంకరణ యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు. టీబీసీ కూడలిలోని భారీ చెట్టు చుట్టూ ఈ ఏడాది తొలిసారిగా దశావతరాల ప్రతిమలను ఏర్పాటు చేశారు. వాటికి రంగురంగుల విద్యుద్దీపాలంకరణ చేపట్టారు. భక్తులను ఆకర్షించేలా మాడవీధుల్లో ఆకర్షణీయంగా రంగవల్లులు తీర్చిదిద్దారు. ఇక కొన్నాళ్లుగా నిర్మాణం జరుపుకుంటున్న నూతన కొలువు మండపం నిర్మాణ పనులు కూడా పూర్తికావస్తున్నాయి. అలాగే తిరువీధుల్లో అక్కడక్కడా చలువపందిళ్లు, పచ్చతోరణాలు ఏర్పాటు చేశారు. కోట్లాది మంది భక్తులు బ్రహ్మోత్సవాలకు హాజరు అవుతుండడంతో.... ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు.

  • Loading...

More Telugu News