: 585 అడుగులకు చేరిన నాగార్జున సాగర్ నీటిమట్టం
రెండు తెలుగు రాష్ట్రాలకూ అత్యంత కీలకమైన నాగార్జున సాగర్ జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 585 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం 1.80 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా... 53 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో డ్యాం నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుకోనుంది.