: మధ్యప్రదేశ్ లో హత్యకు గురైన గుంటూరు జిల్లా వాసులు
మధ్యప్రదేశ్ లోని ఖాండ్వాలో గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. హత్యకు గురైన వారిలో ఒకరు డ్రైవర్ కాగా మరొకరు క్లీనర్. వీరు సత్తెనపల్లి, దాచేపల్లికి చెందిన వారని గుర్తించారు. వీరిద్దరూ మధ్యప్రదేశ్ నుంచి సరకు లారీతో వస్తుండగా గుర్తు తెలియని దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది.