: కేసీఆర్ వ్యాఖ్యల్ని సమర్ధించిన ఎంపీ కవిత
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సమంజసమేనని ఎంపీ కవిత సమర్ధించారు. హైదరాబాదులో ఆమె జాతీయ ఛానెళ్లతో మాట్లాడుతూ, ఆ రెండు ఛానెళ్లు తప్పు చేశాయి కనుక ఎంఎస్వోలు వాటి ప్రసారాలు నిలిపివేశారని అన్నారు. ఆ రెండు మీడియా సంస్థలు తెలంగాణ సమాజం, అసెంబ్లీ ప్రతిష్ట దిగజార్చే విధంగా ప్రవర్తించాయని ఆమె తెలిపారు. తెలంగాణ సమాజాన్ని అవమానించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆమె వివరించారు.