: కేంద్ర మంత్రి వర్గంలో కీలక నిర్ణయాలు
ఢిల్లీలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. చమురు సంస్థల్లో వాటాల ఉపసంహరణపై మంత్రి వర్గం చర్చించింది. ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఎన్ హెచ్ పీసీల్లో వాటాల ఉపసంహరణకు ఆమోదం తెలిపింది. ఈశాన్య రాష్ట్రాల్లో సమగ్ర టెలికాం విధానానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. నాలుగో విడత ఆధార్ కు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపినట్టు సమాచారం.