: శ్వేతబసు ప్రసాద్ ను అప్పగించండి, సరిగా చూసుకుంటా: ఆమె తల్లి
సినీ నటి శ్వేతబసు ప్రసాద్ ను తమకు అప్పగించాలని ఆమె తల్లి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఇకపై శ్వేతబసును జాగ్రత్తగా చూసుకుంటామని, ఆమెను వెన్నంటి ఉండి కాపాడుకుంటానని ఆమె కోర్టుకు చెప్పారు. దీంతో న్యాయమూర్తి శ్వేతను కూడా విచారించారు. ఆమె తల్లితో వెళ్లేందుకు సముఖత వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంరక్షణ గృహంలో ఉంటున్న శ్వేతబసు ప్రసాద్ ను పంపించాలంటే సంరక్షణ గృహం నిర్వాహకులు ఆమె కుటుంబ పరిస్థితిపై న్యాయస్థానానికి నివేదిక సమర్పించాలి. అనంతరం బాధితురాలు, పోలీసుల వాదనలు విని కోర్టు నిర్ణయం తీసుకుంటుంది.