: లవ్ జీహాద్ పై ఆదిత్యనాథ్ కు మద్దతిచ్చిన శివసేన
'లవ్ జీహాద్' పేరిట హిందువుల సంస్కృతిని దెబ్బతీసేందుకు అంతర్జాతీయ కుట్ర జరుగుతోందని శివసేన తెలిపింది. 'లవ్ జీహాద్' ను అడ్డుకునేందుకు పోరాడాలని పిలుపునిచ్చిన బీజేపీ నేత స్వామి అదిత్యనాథ్ కు శివసేన మద్దతు పలికింది. హిందూ యువతులు అప్రమత్తంగా ఉండాలని 'సామ్నా ఎడిటోరియల్'లో హెచ్చరించింది. లవ్ జీహాద్ కు పిలుపునిచ్చిన వారికి హిందూ యువతులు తగిన గుణపాఠం నేర్పాలని కథనం పేర్కొంది. హిందూ సంస్కృతినే కాకుండా, దేశ సమైక్యతను దెబ్బతీసేందుకు లష్కరే తోయిబా, సిమి, అల్ ఖైదా వంటి సంస్థలు ప్రయత్నిస్తున్న విషయాన్ని 'సామ్నా' ఎత్తి చూపింది. ఉగ్రవాదుల తాజా బాంబు 'లవ్ జీహాద్' అని 'సామ్నా' హెచ్చరించింది.